RC16..చరణ్ కొత్త సినిమా

35
- Advertisement -

రామ్ చరణ్ ఇటీవల ఆస్కార్ వేడుక నుండి తిరిగి వచ్చాడు. హైదరాబాద్‌కు వచ్చిన చరణ్ ప్రస్తుతం కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు.

రామ్ చరణ్ రేపటి నుండే శంకర్ డైరెక్షన్ లో సినిమాను మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. చరణ్ మిగిలిన చిత్రీకరణను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా (#RC16) చేయబోతున్నాడు. ఉప్పెన తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన బుచ్చి బాబు అంతకు ముందు రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సహా పలు చిత్రాలకు దర్శకుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు.

బుచ్చిబాబు సినిమా వినూత్నమైన కథతో ఉంటుందని రామ్ చరణ్ ఇటీవలే చెప్పాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామని తెలిపారు చరణ్.

ఈ పీరియడ్ డ్రామాలో రామ్ చరణ్ క్రీడాకారుడిగా నటిస్తాడని సమాచారం.

ఇవి కూడా చదవండి..

- Advertisement -