‘కబ్జ’ కలెక్షన్స్ పై కామెంట్స్

41
- Advertisement -

ఉపేంద్ర , కిచ్చా సుదీప్ హీరోలుగా తెరకెక్కిన ‘కబ్జ’ సినిమా మార్చ్ 17న పాన్ ఇండియా మూవీగా రిలీజైంది. మూడు రోజులకు గానూ ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి 100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసిందని మేకర్స్ ఆఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించారు. అయితే మొదటి రోజే నెగటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు అన్ని కోట్లు ఎలా వచ్చాయని నెటిజన్లు మేకర్స్ ను ప్రశ్నిస్తున్నారు.

నిజానికి కన్నడలో ఉపేంద్ర కి అలాగే కిచ్చా సుదీప్ కి మంచి మార్కెట్ ఉంది. అక్కడ ఇద్దరు స్టార్ హీరోలు కాబట్టి కన్నడ లో మంచి ఓపెనింగ్స్ తెచ్చుకొని ఉండవచ్చు. కానీ మిగతా భాషల్లో ఈ సినిమాకి ఎలాంటి బజ్ లేదు. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమాకి తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. ఇక కబ్జ ట్రైలర్ రిలీజ్ అవ్వగానే ఇది కేజీఫ్ ను పోలి ఉందనే కామెంట్స్ వచ్చాయి.

దీంతో తెలుగులో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. మరి నెగటివ్ టాక్ తో ఈ సినిమా అన్ని భాషలలొ మూడు రోజుల్లోనే 100 కోట్లు కొల్లగొట్టింది అంటే కాస్త అతిశయోక్తి గానే ఉంది.

ఇవి కూడా చదవండి…

బలగం @ 17 కోట్లు

‘ఉగ్రం’నా కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీ..

విశ్వక్ సేన్ 10..గ్రాండ్ లాంఛ్

- Advertisement -