- Advertisement -
బాలీవుడ్ అగ్రహీరోయిన్లలో ఒకరు సోనాక్షి సిన్హా. తాజాగా ఈ అమ్మడి పెళ్లిపై సోషల్ మీడియాలో పుకార్లు షికార్ చేస్తున్నాయి. దీంతో ఈ గాసిప్స్‌పై తనదైన శైలీలో స్పందించింది సోనాక్షి.
తనకు అప్పుడే పెళ్లేంటి. ఇంట్లో వాళ్ల కన్నా జనాలకే నా పెళ్లి మీద ఎక్కువ ఆసక్తి ఉంది. ప్రస్తుతానికి నా జీవితాన్ని వేరే వాళ్ళతో పంచుకునేందుకు రెడీగా లేను అని తెలిపింది. నేనెప్పుడు సినిమాల గురించి మాట్లాడినా, ఎదుటివారు మాత్రం వ్యక్తిగత విషయాలనే అడుగుతారు, వాటి గురించే ఇష్టమొచ్చినట్టు రాస్తారు. నేనేం చెప్పకపోయినా వాళ్ళకి వాళ్ళే ఏదో ఒకటి ఊహించుకొని రాసేస్తారు. నా పెళ్లి గురించి మీకెందుకు. మా ఇంట్లో వల్లే అడగట్లేదు అని మండిపడింది.
- Advertisement -