సీఎం జగన్‌పై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు..

72
- Advertisement -

ఏపీలో అటల్ బిహారీ వాజపేయి జయంతి సందర్భంగా సుపరిపాలన దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మేధావుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు, సునీల్ ధియోధర్ హాజరైయ్యారు. వారు వాజపేయి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ.. వాజపేయి సుపరిపాలనకు ఆదర్శంగా నిలిచారు. ఆయన సభలో మాట్లాడుతుంటే అందరూ ఆసక్తి గా వినేవారు. మరి నేడు పార్లమెంటులో కాగితాలు చింపి గోల చేస్తున్నారు. ఇక ఏపీ అసెంబ్లీలో అయితే ఏకంగా బూతులే మాట్లాడుతున్నారు. నేడు వాజపేయిని అందరూ ఎందుకు గుర్తు చేసుకుంటున్నారో నేటి నేతలు ఆలోచన చేయాలి అన్నారు. రాష్ట్రంలో హ్యాండీ కాప్ట్ ఉన్న పాలకులు ఉన్నారు.

ఏపీ ముఖ్యమంత్రి జగన్, మాజీ సీఎం చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. వీరిద్దరూ మాటలతో జనాలను మోసం చేశారని అన్నారు. రాష్ట్రంలో ఏయే అభివృద్ధి పనులు చేశారో వీరిద్దరూ చెప్పాలని డిమాండ్ చేశారు. వీరు పనులు చేయరు, చేసే వారిని అడ్డుకుంటారని చెప్పారు. వీరికి ఏపీ ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పారు. గత సీఎం గ్రాఫిక్స్ తో మాయ చేస్తే… ప్రస్తుతం సీఎం మాటలతో మోసం చేస్తున్నారని అన్నారు. జగన్, చంద్రబాబు ఇద్దరూ స్టిక్కర్ సీఎంలని ఎద్దేవా చేశారు.

రాజధాని రైతులను చంద్రబాబు మోసం చేశారని సోము వీర్రాజు మండిపడ్డారు. ఆనాడే ఆయన అభివృద్ధి చేసి ఉంటే… అమరావతి రైతులు ఇప్పుడు రోడ్డెక్కే పరిస్థితి వచ్చుండేది కాదని అన్నారు. కమ్యూనిస్టులు కమీషన్ ఏజెంట్లుగా మారారని విమర్శించారు. దేశంలో విద్యావ్యవస్థ నాశనం కావడానికి కమ్యూనిస్టులే కారణమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే… వైసీపీ ప్రభుత్వం డబ్బులు మళ్లిస్తోందని వీర్రాజు మండిపడ్డారు. గ్రామాల అభివృద్ధికి మోదీ వేసిన డబ్బులను జగన్ లాగేసుకున్నారని విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో మంత్రులు బూతులు మాట్లాడుతున్నారని అన్నారు. పధకం‌ కేంద్రానిది అయితే.. చిన్న బొమ్మ వేస్తారు… రంగులు మాత్రం వారి పార్టీవి వేస్తారు. మీలాంటి వారికి తగిన బుద్ది చెప్పే రోజులు త్వరలోనే వస్తాయని దుయ్యబట్టారు.

- Advertisement -