తేనీటి విందుకు హజరైన సీజేఐ ఎన్వీ రమణ..

33

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఏపీలో పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఈ రోజు సాయంత్రం తేనీటి విందు ఏర్పాటు చేసింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో విందుకు సీజేఐ హాజరైయ్యారు. ఆయనను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దంపతులు సాదరంగా ఆహ్వనించారు. ముఖ్యమంత్రితో పాటు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు, మంత్రులు పాల్గొన్నారు. సుప్రింకోర్టు న్యాయమూర్తి జేకే మహేశ్వరి, ఏపీ, తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌లు, రెండు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరైయ్యారు.