లోక్ సభ మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ ఇకలేరు

214
somnath-chatterjee-passes-away-
- Advertisement -

లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమనాథ్ చటర్జీ ఇవాళ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ నెల 7వ తేదీన కోల్‌కతాలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఇవాళ ఉదయం ఆయనకు గుండెపోటురావడంతో చికిత్స పొందుతూ బెల్లెవ్యూ ఆస్పత్రిలో మృతి చెందారు.

somnath-chatterjee-passes-away-

1929, జూలై 25న అసోంలోని తేజ్‌పూర్‌లో సోమ్‌నాథ్‌ చటర్జీ జన్మించారు. మిత్రా ఇన్‌స్టిట్యూట్‌లో స్కూలు విద్య పూర్తి చేశారు. ప్రెసిడెన్సీ కాలేజీ, కలకత్తా యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించారు. రాజకీయాల్లోకి రాకముందు కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు.

సోమనాథ్ ఛటర్జీ 10 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. సీపీఐ(ఎం) పార్టీలో కీలక నేతగా సుదీర్ఘ కాలం కొనసాగారు. సెంట్రల్ కమిటీ మెంబర్‌గా పనిచేశారు. 2004 నుంచి 2009 వరకు లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. 2008లో సీపీఐ(ఎం) యూపీఏ ప్రభుత్వానికి మద్దతు విరమించుకున్నాగాని ఆయన స్పీకర్ పదవికి రాజీనామా చేయలేదు.

- Advertisement -