దుమ్ము రేపుతున్న కాజల్ కికి చాలెంజ్

186
Kajal---Bellamkonda-s--KikiChallenge-

కికి ఛాలెంజ్.. ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తోన్న పేరిది. సినిమా హీరోయిన్ల నుంచి మొదలుకొని సామాన్య ప్రజానీకం వరకు కికి ఛాలెంజ్‌ పేరిట డ్యాన్సులు చేస్తున్నారు. వారు చేయడమే కాకుండా వారి ఫ్రెండ్స్‌కు ఛాలెంజ్‌ విసురుతున్నారు. దీంతో కికి ఛాలెంజ్‌ల పేరుతో డ్యాన్సులు చేస్తుండడంతో పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకుని కికి ఛాలెంజ్‌ పేరిట విన్యాసాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా జారీ చేశారు.

kajal

అయితే పోలీసుల హెచ్చరికలను లెక్కచేయకుండా పలువురు కికి ఛాలెంజ్‌ విన్యాసాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ తో కలిసి కికి ఛాలెంజ్ పేరుతో డ్యాన్స్ చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ వీల్ చైర్ లో కూర్చొని ఉండగా, కాజల్ పక్కనే కూర్చొని ఉంటుంది వెనకనుంచి మరొకరు నెడుతుంటే ఇద్దరు కికి ఛాలెంజ్ సాంగ్ కు డాన్స్ చేస్తారు. అనంతరం కాజల్ చైర్ నుంచి దిగేసి డ్యాన్స్ చేస్తుంది. ఆ తరువాత ఇద్దరు దిగి డ్యాన్స్ చేస్తారు. ఈ కికి ఛాలెంజ్ వీడియోను కాజల్ అగర్వాల్ తన ట్విట్టర్ పేజీ లో పోస్ట్ చేసింది. ఈ కికి ఛాలెంజ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తున్నది. సేఫ్ జోన్‌గా కికి ఛాలెంజ్‌ చేయాలని చెబుతూ బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజల్‌ అగర్వాల్‌ లు చేసిన ఈ వీడియోను చూస్తే ముందు ముందు కికి ఛాలెంజ్‌ను స్వీకరించే వారు సేఫ్‌ కికి ఛాలెంజ్‌ను చేసి ప్రమాదాల బారిన పడకుండా ఉండవచ్చు.