నైపుణ్యాభివృద్ధి,శిక్షణపై సీఎస్ రివ్యూ..

22
cs

యువతకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కు సంబంధించిన అంశాలపై వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ అన్నారు. సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో గ్రామీణాభివృధ్ది, యువజన సేవలు, సాంకేతిక విద్య, మెప్మా, టాస్క్, NAC, మెడికల్ అండ్ హెల్త్, యస్.సి, యస్.టి, బీసి మరియు ఇతర సంక్షేమ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్చించారు. నైపుణ్యాభివృధ్ధి, శిక్షణకు సంబంధించిన అంశాలపై అవసరమైన సూచనల కోసం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి దృష్టికి తీసుకురానున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు నైపుణ్యాభివృద్ధిపై తమ శాఖల ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.ఈ సమావేశంలో కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి రాణి కుముదిని, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్ , రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సునీల్ శర్మ, ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ , యువజన సర్వీసుల ముఖ్యకార్యదర్శి శ్రీ సబ్యసాచి ఘోష్, గ్రామీణాభివృద్ధి , పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, YAT&C కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ రాజు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ S.A.M. రిజ్వీ, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ రాహుల్ బొజ్జా, సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ శ్రీ నవీన్ మిత్తల్, మున్సిపల్ పరిపాలన సంచాలకులు శ్రీ సత్యనారాయణ, గ్రామీణాభివృద్ధి , పంచాయతీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు, ఉపాధి శిక్షణ శాఖ డైరెక్టర్ శ్రీ కె.వై.నాయక్, NAC డైరెక్టర్ జనరల్ శ్రీ బిక్షపతి, NITHAM డైరెక్టర్ డా.ఎస్.చిన్నం రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.