ఎమ్మెల్సీగా పల్లాను గెలిపించండి: ఎర్రబెల్లి

33
dayakar rao

అభివృద్ధిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి సవాల్‌ను పట్టాభద్రుల ఓటర్లు గమనించాలని, దమ్ముంటే ప్రత్యర్థి పార్టీలు స్వీకరించి చర్చకు రావాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సోమవారం వరంగల్ – ఖమ్మం – నల్లగొండ జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల టీఆర్‌ఎస్‌ జనగామ నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశo స్థానిక ఎస్ఆర్ గార్డెన్‌లో జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ…రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలంటూ పట్టాభద్ర ఓటర్లు ఆ పార్టీ నేతలను నిలదీయాలన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన అభివృద్దిపై బీజేపీ నాయకులు చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసరారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మెరెక్కడా అమలు కావడం లేదని గుర్తుచేశారు.