దేశంలో 24 గంటల్లో 10,584 కరోనా కేసులు..

34
covid

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 10,584 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 78 మంది మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,10,16,434కు చేరింది.

దేశంలో 1,47,306 యాక్టివ్ కేసులుండగా 1,07,12,665 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనాతో 1,56,463 మంది మృతిచెందారు. టీకాడ్రైవ్‌లో భాగంగా 1,17,45,55 మందికి వ్యాక్సిన్లు వేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇప్పటి వరకు 21,22,30,431 శాంపిల్స్‌ పరీక్షించినట్లు తెలిపింది.