భారతీయులు ఇష్టమైన భోజన ప్రియులు అవునంటే మీరు నమ్ముతారా…అవును ఇది నిజం. భారతీయుల ప్రాచీన వంటకాల నుంచి ఇప్పటి ప్రాశ్చాత్య ఫుడ్ వరకు అన్ని ఇష్టంగానే తింటారు. ఉదయం అల్పహారంతో మొదలు పెట్టి రాత్రి భోజనం చేసి పడుకునే ముందు వరకు వేసుకొనే తాంబులం వరకు అన్ని ఇష్టంగా తింటాం. అయితే వీటిలో కొన్ని మనకు హానికరకమైనవి ఉంటాయి. మరికొన్ని ఆరోగ్య కరమైనవి ఉంటాయి. మన భారతీయ వంటకాల్లో కొన్ని విదేశాల్లో నిషేధం అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు. మీరే చూడండి టాప్-5 ఫుడ్స్ బ్యాన్ ఇన్ ఫారెన్ కంట్రీస్.
సమోసా
సమోసా అనగానే ఉదయం టీతో ప్రారంభిస్తే సమోసా ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన అల్పాహారంగా ప్రసిద్ది చేందింది. దీన్ని అన్ని వయస్సుల వారు ఇష్టంగా తీసుకునే ఫుడ్. బంగాళదుంప కార్న్ ఆనియన్ లాంటి కూరతో తయారుచేసే సమోసా దక్షిణాఫ్రికాలోని సోమాలియాలో నిషేధం విధించారు. దానికి కారణం ఇది త్రికోణ ఆకారంలో ఉండటమే. అల్-షబాబ్‌గ్రూప్‌లోని భాగంగా త్రిభుజాకార ఆకారం క్రైస్తవ మతానికి చిహ్నంగా చెప్పబడినందున చిరుతిండిని బ్యాన్ చేశారు. అంతేకాదు సోమాలియాలో ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు తప్పవు మరీ. మీరు వెళ్లినప్పుడు సమోసా అడగకుండానే టీ తాగి రండి.
కెచప్
భారత్‌లో టోమాటోతో తయారుచేసే ప్రాశ్చాత్య రెసపీ కెచప్. ఇది సమోసా నుండి శాండ్‌విచ్, బర్గర్, పిజ్జాల వరకు కెచప్‌ను వాడుకుంటాము. అయితే ఫ్రాన్స్‌లో మాత్రము కెచప్ నిషేధం ఎందుకంటే అక్కడ ఆరోగ్య కారణాల రిత్యా నిషేధం విధించామని ప్రభుత్వ వర్గాలు చెబుతాయి. ఫ్రెంచ్ ఆహార సంస్కృతిలో అమెరికీకరణ రాకుండా నిరోధించాడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఒకప్పడు అమెరికా స్వాతంత్య్రం కోసం పోరాడితే సహాయం చేసింది. ముఖ్యంగా దీన్ని పాఠశాల స్థాయిలో పూర్తిగా నిషేధించారు. ఆలుగడ్డలతో తయారు చేసే ఫ్రెంచ్ ఫ్రైస్‌కు మాత్రం కెచప్‌కు అనుమతి ఉంది.
చవన్‌ప్రాష్
భారతదేశంలో ఉదయం పూట ఒక చవన్ ప్రాష్ని ఉపయోగిస్తున్నారు. ఇది పూర్తిగా ప్రాచీన భారతీయ సంప్రదాయాల్లోని పండ్లు మూలికలు నెయ్యి మిశ్రమంతో తయారు చేయబడింది. దీనన్ని తీసుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తిని పెంచుతుందని భారతీయుల నమ్మకం. కానీ కెనడాలో 2005 నుండి చవాన్ ప్రాష్ అమ్మకంను నిషేధించారు. దానికి కారణం ఎంటో తెలుసా..ఇందులో అధిక స్థాయిలో సీసం మరియు పాదరసం ఉందని పేర్కొంటూ నిషేధం విధించింది.
నెయ్యి
ప్రాచీన భారతీయ వంటకాల్లో నెయ్యి ప్రథమ స్థానంలో ఉంటూ వస్తోంది. ముఖ్యంగా స్వీట్స్, వంటల్లో ఉపయోగిస్తున్నారు. కొన్ని సందర్బాల్లో మతపరమైన ఆచారాలకు కూడా ఉపయోగిస్తారు. భారతదేశం పశుసంపద కలిగి ఉండటం వల్ల నెయ్యిని ఎక్కువగా ఉపయోగించుకుంటాము. కానీ దీన్ని అమెరికాలో మాత్రం బ్యాన్ చేశారు. దానికి కారణం అమెరికా ప్రజల్లో రక్తపోటు, గుండెపోటు, ఊబకాయం వంటి సమస్యలకు నెయ్యే ప్రధాన కారణమని అక్కడి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. అన్నట్టు అమెరికాలో ప్రపంచంలోనే అత్యధిక మంది ఊబకాయులు అమెరికాలో ఉన్నారు.
చూయింగ్ గమ్
చూయింగ్ గమ్ ద్వారా మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగించుకుంటున్న వారు ఎక్కువ మంది దీన్ని ఉపయోగిస్తారు. ముఖ్యంగా దంత చికిత్స విభాగంలో పళ్లు గట్టిదనాన్ని చూయింగ్ గమ్‌ను వాడుతారు. చూయింగ్ గమ్‌లో భారత్‌లో రోడ్డు పక్కన పాన్ దుకాణాలు, కిరాణా దుకాణాల్లో విరివిగా దొరుకుతాయి. సింగపూర్ ప్రభుత్వం పరిశుభ్రతను నిర్వహించుకోవాడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో చూయింగ్ గమ్‌ను నమలడం నిషేధం. దీన్ని 1992లో అన్ని రకాల చూయింగ్ గమ్‌ల వినియోగం అమ్మకం పంపిణీ వ్యాపారాన్ని పరిమితి చేసింది. కానీ అంతార్జాతీయ ఒత్తిడికి తలొగ్గి దంత చికిత్స విభాగంలో మాత్రమే చూయింగ్ గమ్‌ను వాడుతున్నారు. అన్నట్టు డాక్టర్ల సలహా మేరకు చూయింగ్ గమ్‌ను వాడాలి.
ఇవి కూడా చదవండి…