సాయి ధరమ్ తేజ్ – నభా నటేష్ హీరో,హీరోయిన్లుగా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్స్‌లోకి రానుండగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.
ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. సాయి ధరమ్ తేజ్ పెళ్ళికి, పెళ్ళానికి చాలా దూరంగా ఉండేలా కనిపించడం, నభా నటేష్‌ని కలిసిన తర్వాత తన అభిప్రాయంలో మార్పులు రావడం వంటి వాటితో ఆసక్తికరంగా ట్రైలర్‌ని తెరకెక్కించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాలి.
Solo Brathuke So Better | Official Trailer | Sai Tej | Nabha Natesh | Subbu | Thaman S | BVSN Prasad