శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కృష్ణారావు…

44
mla krishnarao

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరున్ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ….. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషా లతో ఉండాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్ధించినట్లు తెలిపారు కృష్ణారావు.

దర్శనానంతరం ఆలయ రంగనాయకుల‌ మండపంలో ఆయనకు వేదపండితులు ఆశీర్వచనం అందిచారు. ఆలయ అధికారులు స్వామి వారి పట్టు వస్త్రాలను అందజేశారు.