టాలీవుడ్ మెగా హీరో సాయితేజ్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’.ఈ సినిమాలోని సోలో బ్రతుకు సో బెటర్ అని అందరికీ చెప్పుకుంటూ తిరిగే పాత్రలో తేజు నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో విరాట్ అనే పాత్రలోను, హీరోయిన్ అమృత అనే పాత్రలోను నటిస్తున్నారు. సుబ్బు డైరెక్షన్‌లో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఆమధ్య ‘ప్రతిరోజూ పండగే’తో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సాయితేజ్ నటిస్తోన్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
అయితే తాజాగా ఈ సినిమా నుండి మరోపాటను విడుదల చేశాడు. ‘సాటి సోలో సోదరసోదరీమణులకు విరాట్ చెప్పేది ఏంటంటే… సోలో బ్రతుకే సో బెటర్. మన సింగిల్స్ అందరికీ అంకితం’ అంటూ ఈ టైటిల్ సాంగ్‌ను తేజు ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ‘సోలో బోలో బ్యాచ్‌లర్.. సోలో బతుకే సో బెటర్’ అంటూ ఈ పాట ప్రారంభం అవుతుంది. ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. ఇప్పటికే ఈ సినిమాలోంచి కొన్ని పాటలు విడుదలై అలరిస్తోన్న విషయం తెలిసిందే.