సోలిపేట సుజాతకు అపూర్వ ఆదరణ..

256
solipeta sujatha

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్‌ దూసుకుపోతోంది. టీఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట సుజాతకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో సుజాతను ఆశీర్వదిస్తున్నారు.

దుబ్బాక మండలంలోని చౌదర్‌పల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సుజాత…గ్రామంతో రామలింగారెడ్డికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రామలింగన్నను కాపాడుకున్నది చౌదర్‌పల్లి గ్రామస్తులని, ఊరితో ఉన్న అనుబంధం వెలకట్టలేనిదన్నారు. నియోజకవర్గాన్ని మంరింత అభివృద్ధి చేసుకునేందుకు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించండని గ్రామస్తులను అభ్యర్థించారు.