శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వివేక్‌…

105
ttd

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కుత్‌బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌గౌడ్. ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వివేక్‌…వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాల‌ని స్వామి వారిని ప్రార్ధించినట్లు ఎమ్మెల్యే వివేక్ తెలిపారు. జీహెచ్ఎమ్మెస్సీ ఎన్నికల్లో అఖండమైన విజయం సాధిస్తామ‌ని, వంద స్థానాల్లో గెలుపొందుతామ‌ని ఆశాభావం వ్యక్తం చేశారు.

వివేక్‌తో పాటు ప్ర‌భుత్వ విప్ ఎమ్మెస్ ప్ర‌భాక‌ర్‌, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఉన్నారు. అనంత‌రం రంగనాయకుల మండ‌పంలో వేద పండితులు వారిని ఆశీర్వ‌దించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రాల‌తో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.