నిజామాబాద్ ఎమ్మెల్సీ కౌంటింగ్‌…ఏర్పాట్లు పూర్తి

287
kalvakuntla kavitha
- Advertisement -

నిజామాబాద్ స్ధానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 12(రేపు) ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రారంభంకానుంది. మొత్తం 824 ఓటర్లు ఉండగా 823 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 2 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు.

కరోనా నేపథ్యంలో ఒక్కో పార్టీ నుండి 8 మంది ఏజెంట్లకు మాత్రమే అనుమతివ్వనుండగా మెజార్టీ సభ్యులు టీఆర్ఎస్‌కు చెందిన వారే ఉండటంతో ఆ పార్టీ అభ్యర్ధి కల్వకుంట్ల కవిత గెలుపు లాంఛనమే కానుంది.

2 రౌండ్లలో 6 టేబుళ్ళ మీద కౌంటింగ్ జరగనుండగా మొదటి రౌండ్ లో 6 వందల ఓట్లు, రెండో రౌండ్ లో 223 ఓట్లు లెక్కిస్తారు.ఉదయం 11 గంటల వరకు ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. పోతాంకర్ లక్ష్మీనారాయణ (బీజేపీ), సుభాష్ రెడ్డి( కాంగ్రెస్) బరిలో ఉన్నారు.

- Advertisement -