నా భర్త ఆశయాలను నెరవేరుస్తా: సోలిపేట సుజాత

409
solipeta sujatha
- Advertisement -

దుబ్బాక ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే తన భర్త రామలింగారెడ్డి ఆశయాలను నెరవేరుస్తానని తెలిపారు టీఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట సుజాత. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు,మంత్రి హరీష్‌ రావు,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నాయకులు కలిసి సుజాతను పరామర్శించారు.

మాకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు.. టికెట్ ఇచ్చి ఆశీర్వదించిన కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ గారు మా పెళ్లి చేశారు…… నా పిల్లల పెళ్లి చేశారు….. నా భర్త చనిపోయినప్పుడు కూడా అండగా నిలిచారని తెలిపారు.రామలింగారెడ్డి లాగే తాను కూడా ప్రజలకు అందుబాటులో ఉంటానని… సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు సహకారంతో దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.

- Advertisement -