యూత్ ఐకాన్ …కేటీఆర్ … పుస్తకం ముఖచిత్రం ఆవిష్కరణ

131
gutha

తెలంగాణ శాసన పరిషత్ చైర్మన్ ఛాంబర్ లో ” .యూత్ ఐకాన్..కేటీఆర్ .. ” పుస్తకం ముఖచిత్రాన్ని శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మరియు బోడకుంటి వెంకటేశ్వర్లు ప్రబుత్వ చీఫ్ విప్ ఆవిష్కరించారు.ప్రముఖ వ్యక్తిత్వవికాస నిపుణులు,మైండ్ పవర్ లో ప్రపంచ రికార్డు గ్రహీత,మోటివేషన్ స్పీకర్ రచయిత తాటికొండ వేణుగోపాల్ రెడ్డి,ప్రముఖ రచయిత జర్నలిస్ట్ విజయార్కె రాసిన ఈ పుస్తకం త్వరలో విడుదల కానుంది.

ముఖచిత్రాన్ని ఆవిష్కరించిన శాసన పరిషత్ లోని ప్రబుత్వ చీఫ్ విప్ శ్రీ బోడకుంటి వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ ” యువత నిరాశ నిస్పృహలు వీడి చైతన్యవంతం కావాలి. రేపటి భవిష్యత్తు యువత చేతిలోనే వుంది. యువతకు స్ఫూర్తిగా నిలిచే ఈ పుస్తకం కొత్త ఒరవడిని తీసుకువస్తుందని ,యువతకు దిశానిర్ధేశం చేస్తుందని విశ్వసిస్తున్నాను ” అని అన్నారు.

తాటికొండ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ” సమాజాన్ని ముఖ్యంగా యువతను ప్రభావితం చేసే వ్యక్తుల కథనాలు రేపటితరానికి మార్గదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తున్నాం.ప్రజల అభిప్రాయాలు,యువతకు అవసరమయ్యే స్ఫూర్తికథనాలు ఈ పుస్తకంలోని అధ్యాయాలు ” అన్నారు.

పుస్తక రచయితల్లో ఒకరైన విజయార్కె మాట్లాడుతూ ” ముఖచిత్రం పుస్తకానికి అద్దం లాంటిది. అద్దంలో యువత ఆశయాలు ఆలోచనలు ప్రతిబింబిస్తాయి.ముందుకు నడిపిస్తాయి.ఈ పుస్తకం కొందరికైనా స్ఫూర్తిని ఇస్తుందన్న నమ్మకాన్ని వెలుబుచ్చారు..ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.