21న భారత్‌లో అతిపెద్ద సూర్య గ్రహణం..

372
surya grahanam
- Advertisement -

దేశంలో ఈ నెల 21న అతిపెద్ద సూర్యగ్రహణం ఏర్పడనుంది. సంపూర్ణ సూర్యగ్రహణం కారణంతో వలయాకారంలో కనువిందు చేయనుంది. జూన్ 21న ఆదివారం ఉదయం 9:15 గంటలకు గ్రహణం ప్రారంభమై, మధ్యాహ్నం 3.04 గంటలకు ముగుస్తుంది. అయితే, మధ్యాహ్నం 12.10 గంటలకు గరిష్ఠ స్థితిలో ఉంటుంది.

భూమి, సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చి సూర్యుడు పూర్తిగా కనిపించకపోతే సంపూర్ణ సూర్యగ్రహణంగా, కొంతమేరకే కనిపించకపోతే పాక్షిక సూర్యగ్రహణంగా చెబుతారు. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళరేఖపైకి వచ్చి.. చంద్రుడి నీడ సూర్యుడిపై పడినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది అమావాస్య రోజులలోనే జరుగుతుంది. అయితే, అన్ని అమావాస్యలలోనూ గ్రహణాలు ఏర్పడవు.

ఈ గ్రహణం సమయంలో సూర్యుడి కరోనా, సౌర డిస్క్ చుట్టూ ఒక ప్రకాశవంతమైన దృశ్యంలా కనిపించే అవకాశం ఉంది. కాగా, ఇలాంటి అరుదైన ఘటన మళ్లీ 2031లోనే భారత్‌లో ఏర్పడనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.

- Advertisement -