ఢిల్లీ ఆరోగ్య మంత్రి పరిస్థితి విషమం..

171
Delhi Health Minister
- Advertisement -

ఇటీవల ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్టు అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు న్యుమోనియా కూడా జతకావడంతో శ్వాసపరమైన ఇబ్బందులు పెరిగాయి. ఈ రోజు ఉదయం నుంచి సత్యేంద్ర జైన్ హై ఫీవర్‌తో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంతో అనూహ్యంగా ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయనకు ప్లాస్మా థెరపీ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. వెంటిలేటర్ సాయంతో శ్వాస అందిస్తున్నారు.

సత్యేందర్ జైన్ రెండు రోజుల క్రితం తీవ్ర జ్వరం, శ్వాసపరమైన ఇబ్బందులతో ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. మంగళవారం కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. బుధవారం మరోసారి టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయనే స్వయంగా ప్రకటించారు.

- Advertisement -