సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు గడ్డు కాలం

82
- Advertisement -

సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు గడ్డుకాలం..లేఆఫ్ కారణంతో దిగ్గజ కంపెనీలన్ని ఉద్యోగాల ఉచకోతకు దిగజారాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇలా టెక్ దిగ్గజాలన్నీ ఎంతో సింపుల్ గా ఓ మెయిల్ పంపి మీ సేవలు చాలు అనేస్తున్నాయి.

ఇప్పటివరకు అమెజాన్-18వేల ఉద్యోగాలు, గూగుల్-12వేల ఉద్యోగాలు, మెటా-11వేల ఉద్యోగాలు, మైక్రోసాఫ్ట్-10వేల ఉద్యోగాలు, ట్విట్టర్-5వేల ఉద్యోగులను తొలగించాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొంత మందగమనం కనిపించినా పెద్ద పెద్ద టెక్ కంపెనీలు ముందుగా చేసే పని ఉద్యోగాల్లో కోత పెట్టడమే. ట్విట్టర్ తో మొదలైన లేఆఫ్స్ నెమ్మదిగా మిగతా కంపెనీలకు విస్తరించింది. ఒక్కొక్కొ కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాలు వేలాది మంది ఉద్యోగుల జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి.

మొత్తంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు గడ్డు కాలం నడుస్తోంది. ఏ క్షణం ఉద్యోగం ఊడుతుందో చెప్పలేని పరిస్థితి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలు కూడా వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తూ ఉండటం టెన్షన్ పెడుతోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -