ఉగ్రశిబిరాలను తుడిచిపెట్టాం:సోఫియా ఖురేషి

37
- Advertisement -

పహల్గాం మృతులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సిందూర్‌ చేపట్టినట్లు కర్నల్‌ సోఫియా ఖురేషి తెలిపారు. ఆపరేషన్ సింధూర్‌పై విదేశాంగశాఖ, రక్షణశాఖ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన కల్నల్ సోఫియా ఖురేషి…పాక్‌లోని 9 ఉగ్ర శిబిరాలను తుడిచిపెట్టామన్నారు. గత 30 ఏళ్లలో పాకిస్థాన్‌ ఉగ్రమూకలకు సౌకర్యాలు కల్పిస్తూ, శిక్షణ ఇస్తోందన్నారు. ఉగ్ర స్థావరాలపై దాడుల్లో పాక్‌ పౌరులకు హాని కలగలేదని స్పష్టం చేసారు.

ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ భూతల స్వర్గంగా ఉందని విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ పేర్కొన్నారు. టీఆర్‌ఎఫ్‌ గురించి ఇప్పటికే ఐరాసకు ఫిర్యాదు చేశామన్నారు. ప్రత్యక్ష సాక్షుల వివరాల ఆధారంగా నిందితులను గుర్తించినట్లు చెప్పారు.

హల్గాం ఉగ్రదాడి తమ పనేనని టీఆర్‌ఎఫ్‌ ప్రకటించుకుందని చెప్పారు. ఉగ్ర మూకలకు పాకిస్థాన్‌ అండగా నిలుస్తోందని మండిపడ్డారు. పహల్గాం ఉగ్రదాడి వెనక టీఆర్‌ఎఫ్‌ ఉందన్నారు. టీఆర్‌ఎఫ్‌కు పాకిస్థాన్‌ అండదండలున్నాయన్నారు.

Also Read:సాయుధ బలగాలకు అండగా ఉంటాం: రేవంత్

- Advertisement -