దక్షిణ భారతదేశంలో పండ్లను ఎక్కువగా పండిస్తుంటారు. మనం ఎక్కువగా పండించే పంటల్లో పనస పండు కూడా ఒకటి. ఇక పసన పండు ఎంత తియ్యగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. పసన పండులోని తియ్యదనం కోసమే ఎక్కువమంది ఆ పండును తినడానికి ఇష్టపడుతుంటారు. ఇతర పండ్లకన్నా పనస పండు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇ పండు ను పండించడంలో కానీ తినడంలో అయిన కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఈపండును తింటే ఎన్నో రకాల మేలు జరగుతుంది. అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇందులో చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఈపండులోని పోషకాలు శరీరానికి కూడా బలాన్నిస్తాయి. పనస పండు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.
పనస పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనిషి ఒత్తిడిని తగ్గిస్తారు. ఈపండులో విటమిన్ సి ఉంటుంది. ఈ పండు తినడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ బారి నుండి కాపాడుతోంది. అంతేకాకుండా పనస పండ్లు హైబిపి, లోబిపి రాకుండా కాపాడుతాయి. చర్మం ముడతపడకుండా పనస పండు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ పండు తినడం వల్ల చర్మం యవ్వనంగా కనిస్తుంది. పనస పండు మొక్క రుచి తియ్యగా ఉన్నా అవి ఘగర్ లెవల్స్ ను పెంచవు. వీటిలో ఉండే ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలోని ఘుగర్ లెవల్స్ ను పెంచకుండా చూస్తాయి. డయాబెటిస్ ఉన్న వారు కూడా ఈపనస పండును తినొచ్చు. పనస పండులో విటమిన్ ఎ, సిలు పుష్టిగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతాయి. ఎటువంటి ఇన్ ఫెక్షన్లు రాకుండా పనస పండు ఉపయోగపడుతుంది.
Also Read:పాపం.. రాజగోపాల్ ను ఎవరు పట్టించుకోవట్లే?