కుర్ర హీరోతో సీనియర్ దర్శకుడు

16
- Advertisement -

మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు బి. గోపాల్ టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలకు హిట్స్ ఇచ్చారు. అసెంబ్లీ రౌడీ, లారీ డ్రైవర్, సమరసింహా రెడ్డి, ఇంద్ర లాంటి హిట్ చిత్రాలు తెరకెక్కించింది ఈ దర్శకుడే. అయితే, చాలా కాలం క్రితమే బి. గోపాల్ బాగా స్లో అయ్యారు. ట్రెండ్ కి తగ్గట్లుగా కొత్త ఆలోచనలతో సినిమాలు చేయడంలో విఫలం అయ్యారు. పైగా వయసు పైబడటంతో బి. గోపాల్ దర్శకుడిగా ఫెయిల్ అయ్యారు, ఫేడ్ అవుట్ అయ్యారు. ఐతే, బి. గోపాల్ చివరగా గోపీచంద్ హీరోగా ఓ చిత్రాన్ని చేశారు.

ఆ మూవీ దారుణంగా ఫ్లాప్ అయింది. హీరో గోపీచంద్ చిత్రం తర్వాత బి. గోపాల్ మరో తెలుగు మూవీ చేయలేదు. కాగా ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో బి. గోపాల్ మెగా ఫోన్ పట్టబోతున్నారు. బి. గోపాల్ నెక్స్ట్ మూవీకి హీరో దొరికేశాడు. ఊహించని విధంగా బి. గోపాల్ కుర్ర హీరోని డైరెక్ట్ చేయబోతున్నారు. అహింస చిత్రంలో హీరోగా నటించిన దగ్గుబాటి అభిరామ్ తో బి. గోపాల్ కొత్త చిత్రం ఫిక్స్ అయింది. నిర్మాత సురేష్ బాబు చిన్న కుమారుడిగా అభిరామ్ కి ఓ ఇమేజ్ ఉంది.

కాకపోతే, అభిరామ్ హీరోగా నటించిన అహింస చిత్రం దారుణంగా నిరాశ పరిచింది. బి. గోపాల్ మంచి యాక్షన్ స్క్రిప్ట్ ని రెడీ చేశారట. ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలని బి. గోపాల్ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి. అన్నట్టు ఈ సినిమాకి కొత్త నిర్మాత నిర్మాణం వహించనున్నాడు. సహజంగా సురేష్ బాబు బాగా కమర్షియల్ గా ఉంటాడు. నష్టం వస్తే.. కొడుకు సినిమాకి కూడా దూరంగా ఉంటారు. ఇదే క్రమంలో అభిరామ్ రెండో సినిమాకి కూడా సురేష్ బాబు దూరంగా ఉంటున్నాడు.

Also Read:Congress:కాళేశ్వరంపై కాంగ్రెస్ రాద్దాంతం!

- Advertisement -