సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఇంట్లో పాము కలకలం రేపింది. ఈ రోజు మధ్యాహ్నం ఆయన ఇంట్లోకి పాము దూరింది. దీంతో సీపీ సజ్జనార్ వెంటనే హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న వెంకటేశ్ అనే కానిస్టేబుల్ కు సమాచారం ఇచ్చారు. కానిస్టేబుల్ వెంకటేశ్ సీపీ ఇంటికి చేరుకుని పామును పట్టుకున్నారు. కానిస్టేబుల్ వెంకటేశ్ పాములను పట్టడంలో దిట్ట కావడంతో సీపీ ఆయనకు ఫోన్ చేసి పిలిపించారు. పామును సురక్షితంగా రక్షించి బ్యాగులో వేశాడు.
పామును నెహ్రు పార్క్‌వారికి అందజేయనున్నట్లు తెలిపాడు. పాములను చంపకుండా వాటికి కొత్త జీవితాన్ని ఇస్తున్న వెంకటేష్ సేవలకు గుర్తింపుగా సీపీ రివార్డును ప్రకటించారు.పాములను చూడగానే వెంటనే భయాందోళనకు గురికావొద్దన్నారు. ఆ భయంలో వాటిని చంపొద్దన్నారు. పామును చూస్తే వెంటనే స్నేక్ సొసైటీ సభ్యులకు గానీ లేదా వాటిని పట్టుకునే వారికి గానీ సమాచారం అందజేయాలన్నారు సీపీ సజ్జనార్.