నిద్ర అనేది మనకు ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. నిద్ర పోవడం వల్ల మనకు అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. శరీరం రీచార్జి అవుతుంది. ఫోన్ బ్యాటరీ అయిపోతే దానికి చార్జింగ్ పెట్టినట్టే నిద్ర కూడా మనకు చార్జింగ్ అన్నమాట. అలాంటి నిద్రను పట్టించుకోకపోతే అప్పుడు అనారోగ్య సమస్యలు తప్పవు.
రోజూ తగినంత సమయం కచ్చితంగా నిద్రించాల్సిందే. ఇది వయస్సును బట్టి మారుతుంది. చిన్నారులు, వృద్ధులు అయితే రోజుకు కనీసం 8 నుంచి 10 గంటల వరకు నిద్రపోవాలి. అదే ఇతర వయస్సుల వారు అయితే 7 నుంచి 9 గంటలు నిద్రపోయినా చాలు. ఎటొచ్చీ ఎవరికైనా కనీసం 8 గంటల నిద్ర అవసరం. అయితే నిద్ర సరిగ్గా లేకపోతే ఎలాంటి అనారోగ్య
సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
* రోజూ తగినంత నిద్ర పోకపోతే శరీరంలో అంతర్గతంగా జరిగే పనులకు ఆటంకం కలుగుతుంది. ఆ పనులకు సరిగ్గా శక్తి అందదు. దీంతో మన మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుంది. డిప్రెషన్
బారిన పడతారు. యాక్టివ్‌గా ఉండరు. ఆకలిపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా శరీర రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.
* రోజూ తగినంత నిద్రపోకపోతే అలాంటి వారు త్వరగా చనిపోయే అవకాశం ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అలాంటి వారి ఆయుర్దాయం తగ్గుతుందట.
* తగినంత సమయం నిద్రించకపోతే అలాంటి వారికి గుండె సంబంధ వ్యాధులు త్వరగా వస్తాయట.
* రాత్రి పూట సరిగ్గా నిద్రించకపోతే మరుసటి రోజంతా ఉత్తేజంగా ఉండలేరట. దీంతో అది పనిపై ప్రభావం చూపుతుందట. దీర్ఘ కాలికంగా ఇలా జరిగితే కెరీర్ పరంగా సమస్యలు వస్తాయట.
Also Read:ఈటెల అసంతృప్తి.. హైకమాండ్ కు నష్టమే !
* మద్యం తాగి వాహనం నడపడం ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. అయితే సరిగ్గా నిద్రించకుండా వాహనం నడిపినా అంతే ప్రమాదమట.
* నిద్ర సరిగ్గా పోకపోతే మధుమేహం వస్తుందట. అలాంటి వారు త్వరగా టైప్ 2 డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంటుందట.
* జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఏ విషయాన్ని కూడా సరిగ్గా గుర్తు పెట్టుకోలేరు. అల్జీమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
* సరిగ్గా నిద్రించకపోతే చర్మ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడుతాయి.
Also Read:ప్రపంచ థైరాయిడ్ అవగాహన దినోత్సవం..
* సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల శృంగార సామర్థ్యం కూడా తగ్గుతుందట. స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ ఇలాంటి సమస్యలు వస్తాయట.
* రోజూ తగినంత నిద్ర లేకపోతే దీర్ఘకాలికంగా అలాంటి వారు ఎక్కువగా బరువు పెరిగే అవకాశం ఉంటుందట.