ప్రతీ సీజన్‌లో రైతు డేటా సేకరణ:ఎస్‌కే జోషి

668
cs sk joshi
- Advertisement -

వ్యవసాయ శాఖ ఏఈవోలు గ్రామాల వారీగా , రైతుల వారిగా ప్రతి రోజు నాటిన, వేసిన పంటల వారి వివరాలను ట్యాబ్ ల ద్వారా పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు. మంగళవారం వివిధ శాఖల అధికారులతో కలసి హరితహారం, వాతావరణ పరిస్థితులు, పెన్షన్ల పంపిణీ, 2021 జనాభా లెక్కల సేకరణ, స్వచ్చభారత్ మిషన్, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ ఎస్‌కే జోషి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఏఈవోల కార్యక్రలాపలపై మానిటరింగ్ చేయలన్నారు. రైతుల వారీగా వ్యవసాయ శాఖ డేటా సేకరణ ప్రతి సీజన్‌లో ఉండాలన్నారు. వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి మాట్లాడుతూ గత రెండు రోజులుగా వర్షాలు కురవడం తో వర్షాదార పంటలు 99 శాతం మేరకు సాగయ్యాయని , మేజర్ ప్రాజెక్టులు, చెరువులో నీరు వస్తే వరి పంట సాగు పెరుగుతుందని అన్నారు. ఏఈవోలు రైతుల వారిగా, పంటల వారిగా ప్రతి సీజన్ లో విస్తీర్ణం డాటాను సేకరించడం వలన కనీస మద్దతు ధర అమలు, ఆన్‌లైన్ పేమెంట్స్‌ తదితర అంశాలలో వినియోగించుకోవచ్చని అన్నారు. గత రెండు రోజుల వర్షాలతో కొన్ని మండలాలలో పరిస్థితి మెరుగైందన్నారు.

జిఏడి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా మాట్లాడుతూ 2021 సెన్సస్ కు సంబంధించి గ్రామ, పట్టణ రిజిష్ట్రర్ లను పంపడం పంపాలన్నారు. వరంగల్ అర్బన్, మహబూబ్ నగర్, నిజామబాద్, జిల్లాలో 2021 జనాభా లెక్కల ప్రి టెస్ట్ నిర్వహణకు ఇన్ స్ట్రక్షన్స్ పంపామని ఎన్యుమరేటర్ల ఎంపిక, శిక్షణ ను పూర్తి చేయడంతో పాటు ఇళ్ల వివరాలు,ఎన్ని ఇళ్లు ఉన్నాయో ఎస్టిమేషన్‌ చేపట్టవలసి ఉంటుందన్నారు. సెన్సస్ శాఖ రూపొందించిన ఆండ్రాయిడ్ యాప్ ను ఉపయోగించుకోవాలన్నారు.

వాణిజ్యపన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ కొత్త ఎక్సైజ్ పాలసీ అక్టోబర్ 1 నుండి ప్రారంభం కానున్నందున గిరిజన ప్రాంతాలలో ఉన్న 109 షాపులకు సంబంధించి PESA Act ప్రకారం గ్రామ సభ రిజల్యూషన్స్ పొందే పనులను పదిహేను రోజులలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను కోరారు. భద్రాది కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మహబుబాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూల్ జిల్లాల కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలన్నారు.

పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ మాట్లాడుతూ ఆగస్టు,15 నాటికి జిల్లాలలో టాయిలెట్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. ODF గా ప్రకటించే ముందు టాయిలెట్లను జియో ట్యాగింగ్‌ చేయాలన్నారు. రూర్బన్ కు సంబంధించి ప్రత్యేకంగా సమీక్షించాలని భూ కేటాయింపులను పూర్తి చేసి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పనులు చేపట్టాలన్నారు. Critical gap Findings సంబంధించి పరిపాలన పరమైన అనుమతులు ఇచ్చే పనులు చేపట్టాలన్నారు.

అన్ని జిల్లాలు, పట్టణ ప్రాంతాల్లో సామాజిక బాధ్యత కింద వివిధ సంస్థలు, పరిశ్రమలు హరితహారంలో తమవంతు పాత్ర పోషించేలా ప్రోత్సహించాలని చీఫ్ సెక్రటరీ కలెక్టర్లకు సూచించారు. మొక్కల రక్షణ కోసం ఉపాధి హామీ నిధులతో అనుసంధానం చేసి వాచర్లను నియమించాలని సూచించారు. క్షీణించిన అటవీ ప్రాంతాల పునరుజ్జీవనంలో భాగంగా నాటుతున్న మొక్కల్లో అధికశాతం తెలంగాణ ప్రాంత భూములు, వాతావరణ పరిస్థితులను తట్టుకుని ఎదిగే మొక్కలనే నాటాలని తెలిపారు. ఆలస్యంగానైనా మంచి వర్షాలు కురుస్తున్నాయని ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలు, విభిన్న వర్గాలు తెలంగాణకు హరితహారంలో పాల్గొని విజయవంతం చేయాలని చీఫ్ సెక్రటరీ కోరారు.

- Advertisement -