చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహించిన ప్రీ-సీజన్ ఈవెంట్‌లో ఈ సరదా సంభాషణ అందరినీ ఆకట్టుకుంది. తమిళ నటుడు శివకార్తీకేయన్ … ధోనీని 60 ఏళ్ల వరకు ఆడాలని కోరాడు. ఈ మాట విన్న వెంటనే ప్రేక్షకులు హర్షధ్వానాలతో మార్మోగిపోయారు.
ఐపీఎల్ 2020లో రిటైర్మెంట్ గురించి అడిగినప్పుడు “definitely not!” అని చెప్పిన ధోనీ అప్పటి నుంచి ప్రతి సీజన్‌లో రిటైర్మెంట్‌పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈసారి కూడా అదే ప్రశ్న మరో మలుపు తీసుకుంది.
శివకార్తికేయన్ అభ్యర్థనకు స్పందిస్తూ ధోనీ, “అది చాలా కష్టం” అని నవ్వుతూ చెప్పారు. అయితే నటుడు ఆగకుండా “మీ ఫిట్‌నెస్‌తో అది సాధ్యమే” అని అన్నారు. దీనికి ధోనీ వినయంగా స్పందిస్తూ, “ఫిట్‌నెస్ పెరుగడం లేదు, తగ్గుతోంది… కానీ ప్రయత్నిస్తాను” అని చెప్పడంతో అభిమానులు మరింత ఉత్సాహంగా స్పందించారు.
Also Read:రోజూ తినే ఈ స్నాక్స్‌తో మీ ఆరోగ్యం ఖతం!
ఈ సరదా సంభాషణతో స్టేడియం మొత్తం కేరింతలతో మార్మోగిపోయింది. మాకు సమాధానం వచ్చేసింది సర్! అని శివకార్తికేయన్ చెప్పడంతో ఈ సంభాషణ ముగిసింది.
ఐపీఎల్ 2026లో సీఎస్‌కే తమ తొలి మ్యాచ్‌ను మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.

