ఇకపై సిలిండర్ 14 కేజీలు కాదు 10 కేజీలే?

8
- Advertisement -

దేశంలో వంటగ్యాస్ సరఫరా వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న 14.2 కిలోల గ్యాస్ సిలిండర్లకు బదులుగా, భవిష్యత్తులో 10 కిలోల సిలిండర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఎల్పీజీ కొరతను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పును పరిశీలిస్తున్నాయి. ప్రస్తుతం 14.2 కిలోల సిలిండర్‌లో పూర్తి గ్యాస్ నింపడం కష్టమవుతుండటంతో, అదే సిలిండర్‌లో కేవలం 10 కిలోల గ్యాస్ మాత్రమే సరఫరా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

మధ్యప్రాచ్య ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, తగ్గిన దిగుమతులు, దేశీయ నిల్వల కొరత కారణంగా గ్యాస్ సరఫరాపై ఒత్తిడి పెరిగింది. అందుబాటులో ఉన్న గ్యాస్‌ను ఎక్కువ కుటుంబాలకు పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

సాధారణంగా 14.2 కిలోల సిలిండర్ ఒక కుటుంబానికి 35–40 రోజులు సరిపోతుంది. అయితే 10 కిలోల సిలిండర్ సుమారు ఒక నెల రోజులు మాత్రమే ఉపయోగపడుతుందని అంచనా. దీని వల్ల వినియోగదారులు కొంతవరకు త్వరగా రీఫిల్ చేసుకోవాల్సి రావచ్చు. సిలిండర్‌లో గ్యాస్ పరిమాణం తగ్గించబడితే, ధర కూడా తగ్గే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా కొత్త స్టిక్కర్లు, కొలతల మార్పులు చేయాల్సి ఉంటుందని సమాచారం.

ALso Read:రోజూ తినే ఈ స్నాక్స్‌తో మీ ఆరోగ్యం ఖతం!

ఇది ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్న ప్రతిపాదన మాత్రమే. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు సంబంధిత నియంత్రణ సంస్థల అనుమతి అవసరం.

- Advertisement -