వెబ్ సిరీస్‌లోకి సితార!

46
mahesh

ప్రిన్స్ మహేష్ బాబు కూతురు త్వరలో వెబ్ సిరీస్‌లో నటించనుంది. ఇప్పటివరకు సోషల్ మీడియాలో సందడి చేసిన సితార ఇకపై ఫంటాస్టిక్ తారగా అలరించనుంది.

3డీ యానిమేషన్‌ వెబ్‌సిరీస్‌‌గా తెరకెక్కించిన ఫంటాస్టిక్‌ తారకు ఈ చిన్నారి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారింది. ఈ వెబ్‌సిరీస్‌ పోస్టర్‌ను బుధవారం రాత్రి మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో నమ్రతా శిరోద్కర్‌, బాలీవుడ్‌ నటి నేహా ధూపియా, తెలంగాణా ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ విడుదల చేశారు. ఈ సిరీస్ మొద‌టి సీజ‌న్ ఏప్రిల్‌లో విడుద‌ల చేయ‌నుండగా ఈ కార్యక్రమంలో సితార త‌న ముద్దు ముద్దు మాట‌ల‌తో ప్ర‌తి ఒక్క‌రి దృష్టిని ఆక‌ర్షించింది.