చిన్న వయసైనా బంధాల గురించి అద్భుత నిర్వచనం చెప్పారు మహేష్ బాబు కూతురు సితార. తాత కృష్ణ, తండ్రి మహేష్ ఇద్దరు సూపర్ స్టార్లు. సినిమా ఇండస్ట్రిలో ఎప్పుడూ బిజీగా ఉండే వీరు కాసింత టైం దొరికితే ఫ్యామిలీకి ఇచ్చే ప్రిపరెన్సే వేరే. అందుకే పలువురు నటులు సైతం బహిరంగంగానే మీకు ఎలా సాధ్యమవుతుందని మహేష్‌ని ప్రశ్నించిన సందర్భాలెన్నో. స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారంటే అర్ధం చేసుకోవచ్చు ఫ్యామిలీ అంటే ఎంత ఇంపార్టెన్సో.
తండ్రి కృష్ణ నుండే మహేష్‌కు సైతం ఇదే వారసత్వంగా వచ్చింది. అందుకే సినిమా సినిమాకు ఏమాత్రం గ్యాప్ దొరికినా ఫారిన్ ట్రిప్‌కు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. ఇక ఇదే విషయాన్ని గుర్తుచేశారు సితార. ఇకపై వారాంతపు భోజనాలు ఇంతకు ముందులా ఉండవు. మీరు నాకెన్నో విలువైన విషయాలు నేర్పించారు. నన్నెప్పుడూ నవ్వించేవారు. ఇప్పటి నుంచి అవన్నీ మీ జ్ఞాపకాలుగా నాకు గుర్తుండిపోతాయి. తాత గారు.. మీరు నా హీరో. ఏదో ఒక రోజు మీరు గర్వపడే స్థాయికి నేను చేరుకుంటా. మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నా అని చెప్పారు సితార.
ఇక సితార పోస్ట్ చూసి నెటిజన్లు సైతం హ్యాట్సాఫ్ అని సెల్యూట్ చేస్తున్నారు. చిన్న వయసులోనే కుటుంబ బంధాలను గుర్తుచేస్తూ ఎంతోమంది స్పూర్తిగా నిలిచావని కొనియాడుతున్నారు.
ఇవి కూడా చదవండి..