మొక్కలు నాటిన కార్పొరేటర్ హేమ..

365
Sitaphalmandi Corporator
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్పూర్తిగా తీసుకొని ఈ రోజు తన పుట్టిన రోజును పురస్కరించుకొని సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ తన నివాసంలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం కోసం ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలు నాటాలని.. మనము ఈ సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వాలనుకుంటే మంచి వాతావరణాన్ని అందించడమే అని అన్నారు. మంచి కార్యక్రమం చేపట్టిన మనందరికీ స్ఫూర్తినిచ్చిన రాజ్యసభ సభ్యులు సంతోష్ అన్నకు కృతజ్ఞతలు తెలియజేశారు.

- Advertisement -