నితిన్ ‘రంగ్ దే’ షూటింగ్‌ షురూ..

379
nithin

వెంకీ అట్లూరి దర్శకత్వంలో యంగ్ నితిన్, కీర్తి సురేశ్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘రంగ్ దే’. ఈ చిత్రానికి సంబంధించిన కొంత భాగం షూటింగ్ గతంలోనే జరిగింది. అయితే, కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో గత ఆరు నెలలుగా ఈ షూటింగ్ కూడా మిగతా వాటిలానే ఆగిపోయింది. కేంద్రం నుండి సినిమా షూటింగ్ లకు అనుమతులు ఇచ్చిన ఈ క్రమంలో హీరో నితిన్ ఈ రోజు తన ‘రంగ్ దే’ చిత్రం షూటింగును హైదరాబాదులో మొదలెట్టాడు.

‘ఇప్పుడు అన్ని జాగ్రత్త చర్యలూ తీసుకుని షూటింగ్ తిరిగి ప్రారంభించామని’ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. సంక్రాంతికి చిత్రాన్ని తప్పకుండా థియేటర్లలో విడుదల చేస్తామని కూడా వెల్లడించారు. ఇందులో నితిన్ కు జోడీగా ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించడంతో అంచనాలు మరింతగా పెరిగాయి.