రామన్నపై అభిమానంతో!

122
ktr
- Advertisement -

ఓ వైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మరోవైపు మంత్రిగా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ అందరి చేత ప్రశంసలు పొందుతున్నారు కేటీఆర్. తన పనితీరుతో అందరి మన్ననలు పొందుతున్న రామన్నకు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులున్నారు.

ఈ నేపథ్యంలోనే సంక్రాంతి సందర్బంగా తమ అభిమాన నేతపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. సిరిసిల్ల జిల్లా చిన్నలింగాపూర్ గ్రామంలో ఓ మ‌హిళ త‌న ఇంటి ముందు ముగ్గు వేసింది. ఆ ముగ్గుపై కేటీఆర్ అని ఇంగ్లీష్‌లో రాసి క‌ల‌ర్ల‌తో అలంక‌రించి అభిమానాన్ని చాటుకుంది.

తంగ‌ళ్ల‌ప‌ల్లి మండ‌లం బ‌ద్దెన‌ప‌ల్లికి చెందిన సిలివెరి చిరంజీవి దంప‌తులు కూడా కేటీఆర్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. తినుబండారాల‌పై జై కేటీఆర్ రాసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమకు కేటీఆర్ అంటే ఎంతో అభిమానం అని పేర్కొన్నారు.

- Advertisement -