తన లవర్ శ్రీహాన్ పేరు వినగానే ఎమోషనల్ అయింది నటి సిరి. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో హౌస్‌లో ఉన్నారు శ్రీహాన్. ఇక సిరి బిగ్ బాస్ 5లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 5 సభ్యులతో ఓ ప్రత్యేక షో నిర్వహించారు. ఇందులో సిరి,సన్నీ,కాజల్,అరియానా, సోహైల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంట్లో ఉన్న మీ హార్ట్‌కు ఏం చెబుతారు అని అడిగారు బిగ్ బాస్. అంతే శ్రీహాన్ పేరు వినగానే ఎమోషన్ అయింది సిరి. కన్నీరు ఆపుకోలేక కాజల్‌ని పట్టుకుని ఏడ్చేసింది. శ్రీహాన్ లేకుండా ఇంట్లో ఒక్కదానినే ఉండలేకపోతున్నానని తెలిపింది.
బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్న నటి సిరి. శ్రీహన్‌తో ప్రేమలో ఉన్న సిరి…బిగ్ బాస్ లో తన చేష్టల ద్వారా వీరి లవ్‌కు బ్రేకప్ పడిందనే వార్తలు వచ్చాయి. షణ్ముఖ్‌తో హౌస్‌లో క్లోజ్ ఉండటం తర్వాత వీరిద్దరూ కలిసి గేమ్ ఆడగా ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత షణ్ముఖ్‌కు అతని లవర్ షాకివ్వగా సిరికి కూడా శ్రీహాన్ బ్రేకప్ చెబుతారని అంతా భావించారు.
అయితే అవన్నీ పుకార్లేనని వాటిని కొట్టపారేస్తూ శ్రీహానే తన సర్వస్వం అని తెలిపింది సిరి. ప్రతి క్షణం నా మంచి, చెడు సమయాల్లో పక్కనే నిలిచే వ్యక్తి. మంచి మనసున్న వ్యక్తి. నా బలం, నా మర్గదర్శి, నా గార్డియన్, మై వన్ అండ్ ఓన్లీ శ్రీహాన్ అని చెబుతూ పుకార్లకు బ్రేకప్ చెప్పింది.
ఇవి కూడా చదవండి..