సహజీవనంలో ఆ నటీమణులు

18
- Advertisement -

పెళ్లి కాకుండానే ప్రియుడితో కాపురం చేస్తోంది అంటూ నటి, యాంకర్ ‘సిరి హనుమంత్’ పై ప్రస్తుతం నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ రోజుల్లో సహజీవనం ట్రెండ్ అయిపోయింది. సిరి హనుమంత్.. తన ప్రియుడు శ్రీహన్ తో చాలా కాలంగా ఒకే ఇంట్లో కలిసి ఉంటుందని టాక్. నిజానికి నటుడు శ్రీహన్ తో ఆమె చాలా కాలంగా రిలేషన్ లో ఉంది. ఆ మధ్య శ్రీహన్, ‘సిరి’ని ముద్దుల్లో ముంచెత్తాడు. సిరి హనుమంత్ తో పెళ్లి చేసుకుందాం అని కామెంట్ కూడా చేశాడు.

ఐతే వీరిద్దరూ మాత్రం పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్నారు. ఇటీవల ఈ విషయం మీద ఓపెన్ అయ్యారు. పెళ్లి కాకుండా కలిసి జీవించడం పై విమర్శలు రావడంతో శ్రీహన్ వివరణ ఇచ్చాడు. సిరి హనుమంత్ పెళ్లిని గ్రాండ్ గా చేసుకోవాలి అనుకుంటుంది. అందుకు, చాలా డబ్బు కావాలి. అందుకే ఆలస్యం అవుతుంది. ఈ లోపు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అంటే ఆమె వినలేదు అన్నాడు. మొత్తానికి సిరి హనుమంత్ పెళ్లి చేసుకోకుండానే ప్రియుడితో కలిసి ఉంటుంది.

వాస్తవానికి, ఒక్క సిరి హనుమంత్ మాత్రమే కాదు, ఈ మధ్య చాలామంది సీరియల్ నటీమణులు పెళ్లి కాకుండానే సహజీవనం చేస్తున్నారు. ప్రియాంక జైన్ కూడా తన ప్రియుడు శివ కుమార్ తో సహజీవనం చేస్తోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ముక్కు అవినాష్ మాట్లాడుతూ… ‘ ప్రియాంక జైన్ – శివ కుమార్ మాత్రం పెళ్లి చేసుకోకుండా కాపురం చేస్తున్నారు’ అని షాకింగ్ కామెంట్ చేశాడు. మొత్తానికి పెళ్లి కాకుండా కలిసి జీవించడంలో ఈ నటీమణులు బాగా ఆరితేరిపోయారు.

Also Read:పిక్ టాక్ : అందాల దుకాణం ఓపెన్‌ చేసింది

- Advertisement -