సిరి క్రియేషన్స్ వర్క్స్…ప్రేమదేశం

277
prema desham
Siri Creative Works banner’s ‘Premadesam’ movie is formally launched at Ramanaidu Studios.
- Advertisement -

సిరి క్రియేషన్స్ వర్క్స్ బ్యానర్ లో రూపొందించబడుతున్న “ప్రేమదేశం” చిత్రం రామానాయుడు స్టూడియో లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పూరి జగన్నాధ్ అబ్బాయి ఆకాష్ పూరి చిత్ర ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అజయ్, మాయ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్న ఈ చిత్ర తొలి సన్నివేశానికి ఆకాష్ పూరి క్లాప్ కొట్టగా ఆనంద్ రవి గౌరవ దర్శకత్వం వహించారు. జీవితా రాజశేఖర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. శ్రీకాంత్ శిద్ధం ఈ చిత్రంలో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు శేఖర్ గంగాణమోని సినిమాటోగ్రఫి అందుస్తున్నారు. నీలిమ తిరుమల్ శెట్టి ,శిరీష ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నటీనటులు:అజయ్ కతుర్వ, మాయ, శివ కుమార్ రామచంద్రవరపు, వైశాకి, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్,సాంకేతిక నిపుణులు:డైరెక్టర్: శ్రీకాంత్ శిద్దం,నిర్మాత:శిరీష, నీలిమ తిరుమల్ శెట్టి బ్యానర్: సిరి క్రియేటివ్ వర్క్స్,మ్యూజిక్: మణిశర్మ,సినిమాటోగ్రఫి: శేఖర్ గంగణమోని,ఎడిటర్: కిరణ్ తుంపెర,పబ్లిసిటీ డిజైన్: అనిల్- భాను,పి. ఆర్.ఓ: వంశీ – శేఖర్.

prema desham
Siri Creative Works banner’s ‘Premadesam’ movie is formally launched at Ramanaidu Studios.
- Advertisement -