ఉత్త‌రాఖండ్ సీఎంతో మ‌హేశ్ బాబు.. వైర‌ల్ అవుతోన్న ఫోటో

219
trivendra singh, mahesh babu

మ‌హేశ్ బాబు, వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈమూవీకి సంబంధించిన షూటింగ్ ను నేటి నుంచే ప్రారంభించారు. ఈసినిమా మొద‌టి షెడ్యూల్ ను డెహ్రాడూన్ లో చిత్ర‌క‌రిస్తోన్నారు. సినిమాలోని ప‌లు కీల‌క స‌న్నివేశాల‌ను అక్క‌డ చిత్ర‌క‌రించ‌నున్నట్లు తెలిపారు. ఈరోజు నుంచి ప్రారంభ‌మైన షూటింగ్ లో మ‌హేశ్ పాల్గోన‌నున్నాడు. ఈసినిమాలో మ‌హేశ్ కు స‌ర‌స‌న హీరోయిన్ గా పూజా హెగ్డె న‌టించ‌నుంది.

mahesh babu

అయితే డెహ్రాడూన్ లో షూటింగ్ లో పాల్గోన్న మ‌హేశ్ బాబును ఉత్త‌రాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావ‌త్ మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. షూటింగ్ ప్ర‌దేశానికి వ‌చ్చిన సీఎం త్రివేంద్ర మ‌హేశ్ తో కాసేపు మాట్లాడి వెళ్లారు. ఈసంద‌ర్భంగా ఇద్ద‌రు క‌లిసి మాట్లాడుకుంటున్న ఫోటో ఒక‌టి బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు ఆ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

vamshi paidipalli, mahesh babu

దింతో మ‌హేశ్ అభిమానులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. కొత్త గెటప్ లో మ‌హేశ్ ను చూసి సంబ‌ర‌ప‌డిపోతున్నారు ఫ్యాన్స్. ఈ ఫోటోలో మ‌హేశ్ బాబు గ‌డ్డం, మీసాల‌తో క‌నిపించాడు. ఈసినిమాలో మహేశ్ ఎంబీఏ స్టూడెంట్ గా క‌నిపించ‌నున్నాడు. ఈమూవీకి దిల్ రాజు, అశ్వీనిద‌త్ లు నిర్మాత‌లుగా వ్య‌వ‌హారిస్తోన్నారు. ఇక ఈచిత్రాన్ని సంక్రాంతి బ‌రిలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తోన్నారు చిత్ర నిర్మాత‌లు. మ‌హేశ్ న‌టిస్తోన్న 25వ సినిమా కావ‌డంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు.