సార్..మమ్మల్ని కాపాడితే బానిసలా ఉంటాం

51
- Advertisement -

టర్కీలో జరిగిన ఘోర భూకంపం ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. మరెన్నో కుటుంబాలకు నిలువ నీడ లేకుండా చేసింది. ఇంకా కొన్ని కుటుంబాల్లో సభ్యులు ఏకంగా శిథిలాల కింద నుండి హాహాకారాలు వినపడుతున్నాయి. భారత్ మానవతా దృక్పథంతో రెస్క్యూ సిబ్బందిని అక్కడికి పంపింది. అయిన వాళ్లను కోల్పోయిన వారి ఆక్రందనలతో భూకంప ప్రాంతాలు హృదయ విధారంగా కనిపిస్తున్నాయి. శిథిలాల కింద నుంచి బయటపడుతున్న మృతదేహాలతో ఆయా ప్రదేశాలు మరు భూమిని తలపిస్తున్నాయి. ఈ సందర్భంగా అక్కడ జరిగే రెస్క్యూలో భాగంగా తీసిన వీడియో మనసులను కదిలించి వేస్తోంది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతూ…కన్నీళ్లను తెప్పిస్తున్నాయి. అలాంటి వీడియోలోని దృశ్యమే ఇది. ఆ వీడియోలో సార్ మమ్మల్ని కాపాడండి.. సార్ ఇక్కడ నేను నా తమ్ముడు చెల్లెలు ఉన్నాం. మమ్మల్ని ఈ శిథిలాల నుంచి బయటకి తీయండి నేను మీకు బానిసలా బతుకుతా అని చిన్నారి మరియం రెస్కూ సిబ్బందితో ప్రాధేయపడుతున్న చిన్నారి వీడియో మనసులను చలిస్తోంది. దాంతో చలించిపోయిన రెస్క్యూ సిబ్బంది అయ్యో తల్లీ అంత మాట ఎందుకు అంటూ..నో నో అంటూ సమాధానం చెప్పారు.

ఇవి కూడా చదవండి…

రాహుల్‌ వ్యాఖ్యలను తోసిపుచ్చిన జీవీకే…

నాడు-నేడు…పాఠశాల సీలింగ్ కూలింది

షాకిచ్చిన ఆర్బీఐ…

- Advertisement -