ప్రభుత్వ లక్ష్యంగా బాగున్నా…గుత్తేదారుల దనం దాహంతో ప్రాజెక్టులను నీరుగార్చే ఘటనలు కొకొల్లలు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా పద్మనాభం మండలం అర్చకునిపాలెం ప్రాథమిక పాఠశాల్లో… సీలింగ్ పెచ్చులు ఊడి విద్యార్థులు గాయపడ్డారు. ఒకటో తరగతి చదువుతున్న ఓ అమ్మాయి తలకు తీవ్రగాయమైంది. గాయపడిన విద్యార్థులను ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం విజయనగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ పాఠశాల్లో 1 నుంచి 3వ తరగతి వరకు ఒకే గదిలో తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే పాఠశాల భవనానికి అధికారులు నాడు నేడు పథకం ద్వారా స్కూల్‌కు మరమత్తులు చేసిన తర్వాత ఇలాంటి ఘటన జరగడం ఇప్పుడులో అందరిలో చర్చనీయాంశంగా మారింది. పనుల్లో నాణ్యత లోపంవల్ల జరిగిన ఘటనపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహంతో మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి…

