Karnataka SIR:99 లక్షల ఓట్లు ఔట్!

2
- Advertisement -

కర్ణాటకలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియలో భాగంగా ఓటర్ల వివరాలను పరిశీలించి తుది జాబితాను సిద్ధం చేశారు. ఈ మార్పులతో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది.

కర్ణాటకలో SIR ప్రక్రియ ప్రారంభమైన సమయంలో సుమారు 5.54 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ముసాయిదా జాబితా విడుదల సమయంలో ఈ సంఖ్య 4.46 కోట్లకు తగ్గింది. తుది జాబితాలో సుమారు 4.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఓటర్ల వివరాల పరిశీలనలో భాగంగా చిరునామాలు మారినవారు, మరణించినవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు నమోదైనవారిని గుర్తించారు.

ముసాయిదా జాబితాలో చోటు దక్కని వారిలో సుమారు 80.62 లక్షల మంది చిరునామాల్లో అందుబాటులో లేనివారు లేదా వేరే ప్రాంతాలకు వెళ్లినవారు ఉన్నారు. మరో 16.39 లక్షల మంది మరణించినవారిగా గుర్తించారు. ఏడు లక్షలకు పైగా డూప్లికేట్ నమోదులు, సుమారు 3.83 లక్షల మంది ఇతర కేటగిరీలో ఉన్నారు. అయితే చిరునామా మారినవారు లేదా సర్వే సమయంలో ఇంటి వద్ద అందుబాటులో లేనివారందరూ అనర్హులైన ఓటర్లని భావించకూడదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Also Read:ఆర్నబ్ తుపాన్..ఏపీకి భారీ ముప్పు!

ఓటర్ల జాబితాలో తమ పేరు లేకపోయినా అర్హత ఉన్నవారు మళ్లీ నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్తగా పేరు చేర్చేందుకు ఫారం-6, వివరాల సవరణ కోసం ఫారం-8 సమర్పించవచ్చు. ఇందుకు ఎన్నికల సంఘం ఓటర్ సేవల పోర్టల్ లేదా సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించవచ్చు. తుది జాబితాలో పేర్లు కోల్పోయిన అర్హులైన ఓటర్లు తిరిగి నమోదు చేసుకునేలా ఎన్నికల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టడం కీలకంగా మారింది.

- Advertisement -