ఆర్నబ్ తుపాన్..ఏపీకి భారీ ముప్పు!

2
- Advertisement -

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్ తుపాన్ ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. తుపాన్ ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 115 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

తుపాన్ ప్రభావంతో మంగళవారం కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలతోపాటు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆర్నబ్ తుపాన్ యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే దట్టమైన మేఘాల ప్రభావంతో దిశ మారితే నెల్లూరు–మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశాన్ని కూడా నిపుణులు పరిశీలిస్తున్నారు. తుపాన్ ప్రభావంతో ఏపీ, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారనుంది.

Also Read:ఆ ట్రిక్‌ను మిస్ అయ్యారు!

తుపాన్ ముప్పు నేపథ్యంలో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. ప్రభావిత జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం, రేషన్ దుకాణాల్లో నిత్యావసరాలు అందుబాటులో ఉంచడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు.

- Advertisement -