వ్యవసాయ రంగం, రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదు .. బాధ లేదు అని మండిపడ్డారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి.. ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతు ఏ కారణం చేత మరణించినా రూ.5 లక్షల పరిహారం అందించే పథకం రైతుబీమా .. రైతు చనిపోయిన ఏడు పనిదినాలలో రైతు కుటుంబానికి పరిహారం అందేది అన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ పథకాలలో ఒకటి రైతుబీమా, రైతుబంధు అని యూఎన్ఓ కు చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సంస్థ ప్రకటించిందన్నారు.
రైతుబీమా పథకం ప్రవేశపెట్టిన తరువాత డిసెంబర్ 4, 2023 బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే వరకు రాష్ట్రంలో 1,18,197 మంది రైతులు మరణించగా రూ.5,909.85 కోట్లు ఆ రైతు కుటుంబాలకు పరిహారంగా అందించడం జరిగిందని తెలిపారు. రైతుబీమా పథకం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.6122.65 కోట్లు ఎల్ఐసీ కి ప్రీమియంగా చెల్లించింది అన్నారు.
ఏడాదికి రూ.1500 కోట్లకు గాను రెండో విడత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.750 కోట్ల ప్రీమియం చెల్లించని కారణంగా ఏడు వేల పై చిలుకు కుటుంబాల పరిహారం పెండింగులో ఉన్నాయి అన్నారు. 440కి పైగా రైతులు 15 నెలల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. కరంటు రాదు, నీళ్లు రావు, రైతుబంధు రాదు, రైతుభీమా ప్రీమియం చెల్లించరు .. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమిస్తున్నది ? చెప్పాలన్నారు.
Also Read:ఐఆర్‌సీటీసీకి నవరత్న హోదా
కాంగ్రెస్ అభయహస్తంలో వ్యవసాయానికి రూ.3 లక్షల వడ్డీ లేని రుణం అన్నారు. 24 గంటల కరంటు అన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ మొదలే పెట్టలేదు. వ్యవసాయ అనుబంధ రంగాలలో ఖాళీలను భర్తీ చేయలేదు. అసైన్డ్ పోడు భూములకు పట్టాభూములతో సమానంగా పరిహారం అని దాని ఊసెత్తడం లేదు… ప్రభుత్వ భూములను కుదువపెట్టి రైతుభరోసా కోసం అని రూ.10 వేల కోట్లు తెచ్చి రెండు నెలలు అవుతుంది .. మూడెకరాల వరకు రైతులకు కూడా రైతుభరోసా నిధులు పడలేదు అన్నారు.
మూడెకరాల వరకు రైతుభరోసా ఇచ్చామని వ్యవసాయ మంత్రి చెబుతుంటే .. మూడెకరాల వరకు రైతులకు డబ్బులు వేయాలని ఉప ముఖ్యమంత్రి చెబుతున్నారు..పది వేల కోట్లు తెచ్చిన ప్రభుత్వానికి రూ.750 కోట్లు రైతుభీమా ప్రీమియం చెల్లించడానికి ప్రభుత్వానికి ఎందుకు మనసు రావడం లేదు ? అన్నారు. ఇది రైతు అనుకూల ప్రభుత్వమా ? రైతుబీమాను ప్రభుత్వం నీరు గార్చే ప్రయత్నం చేస్తుంది.. రైతులు కష్టపడి పంటలు పండిస్తుంటే సాగునీళ్లు లేక, కరంటు లేక రైతుల పొలాలు ఎందుతున్నాయి .. పశువులకు మేతగా మారుతున్నాయి అన్నారు.

