సింగర్‌ సునీత పెళ్లి డేట్‌ ఫిక్స్‌..

344
singer_sunitha
- Advertisement -

టాలీవుడ్‌ సింగర్‌ సునీత రెండో పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనితో సునీత కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు. ఇటీవలే వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇక వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయింది. జనవరి 9న సునీత, రామ్ ల వివాహం జరగనుంది. ముందుగా డిసెంబర్ 27న ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. డిసెంబర్ 27న పెళ్లి అని ప్రీ వెడ్డింగ్ పార్టీ కూడా ఇచ్చారు. ఇండస్ట్రీలో ఉన్న కొందరు సెలబ్రిటీస్‌తో పాటు సంగీత ప్రముఖులు కూడా వచ్చారు.

అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం సునీత రెండో పెళ్లి తేదీ మారింద‌ని తెలిసింది.జనవరి 9న వీరి వివాహం జరగనుంది.కరోనా నేపథ్యంలో కుటుంబసభ్యులు, కొంత మంది సన్నిహితుల మధ్య వీరి వివాహం జరగబోతోంది. మరోవైపు ఈరోజు సినీ సెలబ్రిటీల కోసం ప్రీ వెడ్డింగ్ పార్టీని కాబోయే కొత్త దంపతులు ఏర్పాటు చేశారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది.

- Advertisement -