డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ప్రముఖ సింగర్..

282
Singer Rahul Sipligunj

రంగస్థలం సినిమాకు టైటిల్ సాంగ్ పాడిన రాహుల్‌ సిప్లిగంజ్‌ తప్పతాగి ట్రాఫిక్ పోలీసులను అడ్డంగా దొరిపోయాడు. శుక్రవారం అర్ధరాత్రి జూబ్లీ హిల్స్‌లో పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో తెలుగు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పట్టుబడ్డాడు. మాదాపూర్ నుంచి జూబ్లీ హిల్స్‌ వైపు వస్తున్న రాహుల్‌కు పోలీసులు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించగా 178 పాయింట్లు వచ్చాయి. అంతేకాదు తాగిన మత్తులో రాహుల్ పోలీసులకు సహకరించకుండా వారితో వాగ్వాదానికి దిగడంతో కేసు బుక్ చేసిన పోలీసులు కారును సీజ్ చేశారు.

Singer Rahul Sipligunj

ఈ సింగర్‌తోపాటు యాంకర్, నటుడు లోబో కూడా ఉన్నాడు. రాహుల్ సిప్లిగంజ్ లైసెన్స్ లేకుండానే కారు నడిపినట్టు తెలుస్తోంది. రాహుల్‌.. పూర్‌ గర్ల్, మంగమ్మ, మాక్కికిరికిరీ, గల్లీకా గణేష్‌ వంటి ప్రైవేట్‌ ఆల్బమ్‌లతో రాహుల్‌ మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు. ఇక మరోవైపు జూబ్లీహిల్స్‌లో జరిగిన డ్రైవ్‌లో మొత్తం 120మందికిపైగా మందుబాబులు పోలీసులకు దొరికిపోయారు. తాగి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేసి.. వాహనాలను సీజ్ చేశారు. వీటిలో 60కిపైగా కారులు.. 62 బైకులు ఉన్నాయి. దొరికిపోయిన వారిందర్ని సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించి.. కోర్టులో హాజరుపర్చనున్నారు.