రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గాయకుడు సాకేత్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని పార్కు లో మొక్కలు నాటిన గాయకుడు దినకర్.
ఈ సందర్భంగా దినకర్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు చాలా మంచి కార్యక్రమం చేపట్టారు.అందుకు సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు. కాలుష్యం పెరిగిపోతున్న ఈ సందర్భంలో బాధ్యతగా మనందరం కూడా చెట్లను పెంచాలని కోరారు. మా ఇంట్లో కూడా మేము ముఖ్యంగా మా తండ్రి గారు ప్రత్యేక శ్రద్ధతో మొక్కలు పెంచుతారని తెలిపారు.
ప్రతి ఒక్కరు కూడా విధిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మరొక ముగ్గురు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ; సింగర్ దీపు; తబలా కళాకారులు బాలరాజు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.


