సింగరేణి సైరన్‌ మొబైల్‌ యాప్‌ ఆవిష్కరణ

520
singareni
- Advertisement -

సింగరేణి కాలరీస్ ప్రజా సంబంధాల శాఖ ఆధ్వర్యంలో సింగరేణి సైరన్‌ యూ ట్యూబ్ ఛానల్‌ను 2018లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అత్యంత ప్రజాదరణ పొందుతున్న ఈ యూ ట్యూబ్ ఛానల్‌లో భూమి పొరల్లో పాటకు మంచి స్పందన వచ్చింది. ఇక సింగేణి బొగ్గు గనులకు సంబంధించిన ఇంగ్లీష్ డాక్యూమెంటరీలు దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి నుండి మంచి వ్యూస్ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సింగరేణి సైరన్ యూ చానెల్‌ను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు మొబైల్ యాప్‌ను రూపొందించింది సింగరేణి యాజమాన్యం. బొగ్గు అన్వేషణ, ఉత్పత్తి, ఉద్యోగాల కల్పన, సామాజిక బాధ్యతలో భాగంగా అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు ఈ యాప్‌ ద్వారా అందించనున్నారు. ఈ యాప్‌ను సంస్థ జనరల్‌ మేనేజర్‌(కో-ఆర్డినేషన్‌) ఆంటోనిరాజా గురువారం ప్రారంభించారు. సింగరేణి సమగ్ర సమాచారం ఇందులో ఉంటుందని తెలిపారు.

ప్రజలందరు తమ మొబైల్ పోన్‌లో సింగరేణి సైరన్ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ యాప్‌తో పాటు ఫేస్ బుక్,ట్విట్టర్,ఇన్‌ స్టాగ్రామ్‌ వంటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సింగరేణి సంస్థకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసోవచ్చారు.

- Advertisement -