కృష్ణ బర్త్‌ డే గిఫ్ట్..మహేష్ 26 టైటిల్ అదిరింది

324
mahesh 26 movie title

సూపర్ స్టార్ కృష్ణ 75వ పుట్టిన రోజు సందర్భంగా ప్రిన్స్ మహేశ్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. మహర్షితో హిట్ కొట్టిన మహేశ్‌ 26వ సినిమాగా సరిలేరు నీకెవ్వరూ అంటూ రాబోతున్నారు. మహేశ్ బాబు తదుపరి చిత్ర టైటిల్‌ను ప్రకటించడానికి ఇంత కంటే గొప్ప సందర్భం ఏముుంటుందని కృష్ణ గారి నోటి నుంచి టైటిల్ ఏంటో వినండంటూ ట్వీట్ చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి .

2020 సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. బరిలో నిలుస్తుందని కృష్ణ తెలిపారు. సిల్వర్ జూబ్లీ పూర్తి చేసిన సూపర్ స్టార్.. గోల్డెన్ ఎరా మొదలవుతోందని ఈ వీడియోలో పేర్కొన్నారు. రాజకుమారుడు దగ్గరి నుంచి మహేశ్‌ నటించిన సినిమా టైటిల్స్‌తో రూపొందించిన వీడియో అందరిని ఆకట్టుకుంటోంది. టైటిల్‌ చివర్లో తుపాకీ దానిపై సోల్జర్‌ క్యాప్‌ చూస్తుంటే ఇది ఆర్మీ నేపథ్యంతో కూడిన సినిమా అని అర్థమవుతోంది.

జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్, ఏకే ఎంటర్‌టైన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో రష్మిక మందనా, అదితీ రావు హైదరీ హీరోయిన్లుగా నటించనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ సినిమా షూటింగ్‌ లాంఛనంగా ప్రారంభం కానుంది.