సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి..

269
sccl
- Advertisement -

గత వారం రోజులుగా కురుస్తున్న వర్షలతో పెద్దపల్లి జిల్లా రామగుండం రీజీయన్ లో 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణి కి గుండెకాయగా ఉన్న ఓసిపిల్లో బొగ్గు నిలిచిపోవటంతో సంస్థకు సుమారుగా 12 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిన్నట్లు అధికారులు చెప్పుతున్నారు.

ఓసిల్లోకి వరదనీరు చేరటంతో మోటర్ల సహయంతో బయటకు పంపుతున్నారు.రోజుకు 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలుగుతుంది. సింగరేణి ఓపెన్ కాస్ట్ లోకి చేరిన వరద నీరు.నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షాలతో సింగరేణి బొగ్గు పరిశ్రమలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.గత వారం రోజుల నుండి నిరంతరంగా కురుస్తున్న వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది.

అదే విధంగా ఆయా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో ఓవర్ గార్డెన్ మట్టి పనులు కూడా నిలిపివేశారు. రామగుండం రీజియన్లో
ఓ సి పి 1 లో 15 వేల టన్నులు, ఓ సి పి 2 లో 6 వేల టన్నులు , ఓ సి పి 3 లో 15 వేల టన్నులు , ఓ సి పి 4 లో 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఏమాత్రం బొగ్గు తీయ లేని పరిస్థితి ఓపెన్ కాస్ట్లీ ఏర్పడుతుంది.
వర్షాలతో వరద నీరంతా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ లోకి చేరగా భారీ యంత్రాలు నీట మునగ కుండా సింగరేణి అధికారులు యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

అదే విధంగా ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో చేరిన వరద నీటిని బయటకు పంపించేందుకు ప్రత్యేకమైన మోటార్లను ఏర్పాటు చేసి పంపింగ్ ద్వారా బయటకు వదులుతున్నారు ఎక్కడ చూసినా బురదమయంగా కనిపిస్తుంది దీంతో ఎక్కడి వాహనాలను అక్కడే నిలిపివేశారు.సింగరేణి సంస్థకు చెందిన ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఓపెన్కాస్ట్ ప్రాజెక్టుల లో ప్రత్యేక చర్యలను అధికారులు చేపడుతున్నారు.

- Advertisement -